![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -30 లో.. ధన ఆ పరిస్థితిలో ఉన్నాడని రామలక్ష్మి, వాళ్ళ అమ్మ బాధపడుతుంటే.. నా మనసేం బాగోలేదు డబ్బులు ఇవ్వు అని మాణిక్యం అనగానే.. నువ్వు ఏం మనిషివి కొడుకు హాస్పిటల్ లో ఉంటే నీకు తాగడానికి డబ్బులు కావాలా అంటూ మాణిక్యం భార్య సుజాత తిడుతుంది. ఆ తర్వాత కోపంగా రామలక్ష్మి డబ్బులు ఇవ్వగానే అవి తీసుకొని మాణిక్యం వెళ్లిపోతాడు.
ఆ తర్వాత రామలక్ష్మి అనేసిన మాటలు సిరి గుర్తుకుచేసుకొని ఎమోషనల్ అవుతుంది. దీనికి కారణం సీతాకాంత్ అనుకొని తన దగ్గరకి వెళ్ళి ఎందుకు ఇలా చేసావ్? నన్ను ప్రేమించిన పాపానికి ధనని హాస్పిటల్ పాలు చేస్తావా అని సీతాకాంత్ ని నీలదీస్తుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్? నేను హాస్పిటల్ పాలు చెయ్యడమేంటని సీతాకాంత్ చెప్పినా కూడా సిరి వినకుండా.. నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు.. నాపై ప్రేమ చూపిస్తుంటే గొప్పోడివి అనుకున్న కానీ ఇలా చేస్తావని అనుకులేదంటు వెళిపోతు.. ధనది తప్పు అయితే నాది కూడా తప్పే నన్ను కూడా శిక్షించు.. ధనకి ఏదైనా అయితే మాత్రం నేను ఉండలేనని సిరి అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ తన అమ్మ శ్రీలత దగ్గరికి వెళ్లి.. సిరి ప్రేమించిన అబ్బాయి హాస్పిటల్ లో ఉన్నాడంట దీనికి కారణం ఎవరని అడుగుతాడు. నేనే అని శ్రీలత అనగానే సీతాకాంత్ షాక్ అవుతాడు.
ఆ తర్వాత ఎందుకు ఇలా చేసావ్ అమ్మ ఒక మనిషిని చంపడానికి కూడా నువ్వు వెనకాడటం లేదంటే నేను నమ్మలేకపోతున్న అని సీతాకాంత్ అనగానే.. వేరే మార్గం లేదు. వాడిని భయపెట్టాలని అనుకున్నాను. అందులో సక్సెస్ అయ్యాను. నా కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకున్న అంతే అని శ్రీలత అంటుంది. తప్పు చేసావ్ అమ్మ ఇలాంటివి సున్నితంగా డీల్ చేయాలి. నేను సిరిని ఎప్పుడు బాధపెట్టలేదు అన్నీ తనకి నచ్చినవి ఇచ్చాను ఇది కూడా తనకి నచ్చింది ఇవ్వాలని అనుకుంటున్నా అని సీతాకాంత్ అనగానే.. అంటే నన్నే ఎదిరిస్తావా అని శ్రీలత అంటుంది. నేనేం చేసినా సిరి సంతోషం కోసమే.. అర్థం చేసుకోమని సీతాకాంత్ చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్న సిరి.. తన అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకున్నానని పశ్చాత్తాపంతో సీతాకాంత్ దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుతుంది. నువ్వు బాధలో అన్నావ్.. ఆ బాధని పోగొట్టడానికి ఈ అన్నయ్య ఉన్నాడు. ఆ అబ్బాయి ఏ హాస్పిటల్ లో ఉన్నాడని సీతాకాంత్ అనగానే.. సిరి హ్యాపీగా ఫీల్ అవుతు ధన గురించి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |